పరిస్థితులు అనుకూలిస్తూండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదుట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలోని టాప్-8 నగరాల్లో, నివాస గృహాల సగటు ధరలు 2024 చివరి మూడునెలల్లో పెరిగాయని తాజా రిపోర్టు వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం అదే కాలంతో పోలిస్తే, సమీక్ష కాలంలో 10 శాతం మేర పెరిగాయి.
2024చివరి మూడు నెలల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఇళ్ల రేట్లు సంవత్సర కాలంలోనే అత్యధికంగా 31 శాతం వృద్ధి చెందాయి. ఇక్కడ చదరపు అడుగు ధర పన్నెండు వేలకు చేరుకుంది. బెంగళూరు రెండో స్థానంలో ఉంది. అక్కడ నివాస గృహాల ధరలు 23 శాతం పెరిగాయి. హైదరాబాద్లో రేట్లు సగటున 2 శాతం పెరిగినట్లుగా తేలింది. పెరుగుదల గొప్పగా లేదుకానీ అంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇది చాలా బెటర్ అని అంచనావేస్తున్నారు.
ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయని ట్రెండ్ చెబుతోంది. ఈ ఏడాది అందుబాటు గృహాల విభాగానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని లగ్జరీ & అల్ట్రా-లగ్జరీ విభాగాలలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని క్రెడాయ్ తాజా నివేదిక వెల్లడించింది. అమ్ముడుపోని ఇండివిడ్యువల్ ఇళ్లు, విల్లాలు , అపార్ట్మెంట్ ఫ్లాట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో అమ్ముడుకాకుండా ఆగిపోయిన ఇళ్లు కూడా ఇప్పుడు అమ్ముడుపోతున్నాయని, ఓవరాల్గా ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు 2025 ఓ సక్సెస్ ఫుల్ ఇయర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.