హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే జాతీయ రహదారి .. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు గోల్డ్ అని చెప్పపుకోవచ్చు. పెట్టుబడి పెట్టాలనుకుంటే హైదరాబాద్ సిటీకి 60 కి.మీ. పరిధిలో ఎక్కడైనా స్థలాలు కొనుక్కోవచ్చు. అక్కడి వరకూ హైదరాబాద్గానే చెప్పుకునే వెసులుబాటు ముంబై హైవే వైపు ఉంటుంది. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ముంబై హైవే గా చెప్పుుకంటే.. బీహచ్ఈఎల్ దగ్గర అసలైన జాతీయ రహదారి ప్రారంభమవుతుందని అనుకోవచ్చు.
హైదరాబాద్-ముంబై హైవే మీద రామచంద్రాపురం, సంగారెడ్డి, రుద్రారం, సదాశివపేట, జహీరాబాద్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో హాట్ కేకులు, సదాశివపేటను కూడా.. హైదరాబాద్ కు దగ్గరగా చెప్పుకుంటున్నారు. ఇక బోర్డర్ లో ఉండే జహీరాబాద్ ను కూడా హైదరాబాద్ శివారుగానే పరిగణించి లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు. హైవే పక్కన ఎక్కడ తక్కువ ధరకు స్థలం దొరికితే అక్కడ కొనుక్కుంటే మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు.
హైవేకి ఒకటి, రెండు కి.మీ. పరిధిలో ల్యాండ్ కొనుగోలు చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి ట్టుబడి మీద 25 నుంచి 30 శాతం రిటర్న్స్ వస్తాయని ఇప్పటికే పెరుగుతున్న రేట్లు నిరూపిస్తున్నాయి. సదాశివపేట వరకూ ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. అయితే ఫామ్ ల్యాండ్స్ పేరుతో చిన్న చిన్న బిట్లు కొనడం కన్నా తక్కువ రేటులో కొనాలంటే వ్యవసాయ భూములే కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకూ దగ్గర ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. గజం 10 వేల నుంచి 11 వేలు రేంజ్ లో ఉన్నాయి. హైవే నుంచి కొంచెం లోపలకు వెళ్తే 9 వేలు పలుకుతున్నాయి. జహీరాబాద్ కి 30 కి.మీ పరిధిలో అయితే గజం 6 వేల రేంజ్ లోనే దొరుకుతున్నాయని.. 600 గజాలు నలభై లక్షల వరకూ అవుతోంందని చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ లోపెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారు.. స్వయంగా ఆాయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలన చేసుకుని .. ల్యాండ్స్ కొనుక్కుంటే నష్టపోకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.