హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు దూరంగా వెళ్తోందనడానికి గణాంకాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. డాక్యుమెంట్లు తగ్గినా ఆదాయం మాత్రం పెరుగుతోంది. తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 8,89,019 లక్షల డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.7,253 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో 9,11,436 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు ఆదాయం 26 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో మాత్రం ఆదాయంతో పాటు డాక్యుమెంట్లు తగ్గాయి. దీనికి హైడ్రా వివాదం ప్రధాన కారణం అనుకోవచ్చు.
రికార్డుల పరంగా చూస్తే , 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేష్ జరిగితే ద్వారా రూ.14,483 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఈ సంవత్సరం సంబంధించి ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు 8,89,019 లక్షల డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.7,253 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అంటే… పరిస్థితి కుదట పడితే రియల్ ఎస్టేట్ ఊహించని స్థాయిల పరుగులు పెట్టే అవకాశం ఉంది.ఆదాయం ఎక్కువగా వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యల కారణంగా ప్రజలు ఆస్తుల కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తుండటంతో డాక్యుమెంట్లు తగ్గిపోతున్నాయి.
హైడ్రాతో పాటు వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ప్రస్తుతం హైడ్రా దెబ్బకు హెచ్ఎండిఏ, డిటిసిపి అధికారులు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహారిస్తుండడం కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణం . రెండునెలలుగా అనుమతుల విషయంలో అధికారులు ఆలస్యం చేస్తూండటంతో లెక్కిస్తుండడంతో బిల్డర్లు, రియల్టర్లు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. హైడ్రాకు చట్టబద్దత రావడంతో పాటు మొత్తం ఇతర విషయాల్లోనూ స్పష్టత వస్తూండటంతో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఇళ్లను నిర్మిస్తే మరింత పుంజుకునే అవకాశం ఉంది.