హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశంలోని దిగ్గజం సంస్థలను ఆకర్షిస్తోంది. తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలోని గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీ హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించింది. రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సమాచారం లో కంపెనీ ఈ విషయం తెలిపింది. హైదరాబాద్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన కోకాపేట్ ప్రాంతంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ‘‘గోద్రెజ్ మాడిసన్ అవెన్యూ’’ పేరిట చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 12 లక్షల చదరపు అడుగులను నిర్మిస్తారు.
ఎస్ఎఫ్టీని పదివేలకు ఆఫర్ చేస్తూ బుకింగ్స్ ప్రారంభించారు. ప్రాజెక్టు మొత్తం బుకింగ్ విలువ రూ.1,300 కోట్లుంటుందని అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టులో 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. మంచి వృద్ధి అవకాశాలున్న హైదరాబాద్‌లో ఇది తమ తొలి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు అని గోద్రెజ్ ప్రాపర్టీస్ చెబుతోంది. మన్హటన్ తరహా లాండ్స్కే్పలతో ఈ ప్రాజెక్టు ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు.
అత్యంత లగ్జరీ ప్రాజెక్టులు ఉన్న కోకాపేట ప్రాంతంలోనే గోద్రెజ్ ప్రాపర్టీస్ దీన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అగ్రశ్రేణి విద్యా సంస్థలు, ప్రీమియం రిటైల్, హెల్త్‌కేర్ వసతులకు చక్కటి కనెక్టివిటీ ఉండేఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులతో పోలిస్తే గోద్రెజ్ ఆఫర్ చేస్తున్న ధర చాలాతక్కువేనన్న అభిప్రాయం ఉంది. అందుకే ఇది హాట్ కేక్‌గా భావిస్తున్నారు.