హైదరాబాద్ లో సినీ పరిశ్రమకు చెందిన వారు డ్రగ్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించామని వారు మారకపోతే ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ కొత్త సీపీ కొత్త కోట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కొత్త సీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్ాడారు. హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదం ను నిర్ములిస్తానని ప్రకటించారు. మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలు పై అలెర్ట్ ఉండాల్సి ఉందన్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీస్ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానమని.. మహిళ వేధింపులు, ర్యాగింగ్ లు కూడా షీ టీమ్స్ ద్వారా మరింత పని తీరు ను మెరుగు పరుస్తామన్నారు.
తెలంగాణా స్టేట్ తో పాటు హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీ గా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ , రాచకొండ కమిషనర్లు తో కూడా సమన్వయం చేసుకొని ముందు కు పోతామని తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ సిటీ గా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా పనిచేస్తామన్నరాు. గతంలో డ్రగ్స్ ముఠాలు పై ఉక్కుపాదం మోపారన్నారు. డ్రగ్స్ ముఠాలను హెచ్చరిస్తున్నాననని.. హైదరాబాద్ , తెలంగాణా ను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్ళాలన్నారు. లేక పోతే ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించాము .. మీరు మారక పోతే సినీ ఇండస్ట్రీ లో ఉన్న వారిని కూడా వదిలేది లేదు. సినీ పెద్దలతో త్వరలో మీటింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. సిన్సియర్ ఆఫీసర్గా పేరున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చాలా కాలం లూప్ లైన్ లో ఉన్నారు.
ఆయన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరు. అలాంటి ఆఫీసర్ ను తీసుకు వచ్చి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సీపీగా నియమించారు. ఇంతకు ముందు సీవీ ఆనంద్ ఉండేవారు. ఈసీ ఆయనను బ దిలీ చేయడంతో.. సందీప్ శాండిల్యను నియమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరోకి పంపి శ్రీనివాస్ రెడ్డి కి బాధ్యతలిచ్చారు.