చెరువులను చెరబట్టిన వారి అంతు చూస్తున్న హైడ్రాపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మజ్లిస్ ఎమ్మెల్యేను అరెస్టు చేసి రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా ఆదివారం తెరపైకి వచ్చారు. అక్కడా .. ఇక్కడా అన్ని చెరువులను కబ్జా చేసినవే అని.. వాటిని తొలగిస్తారా అని సవాల్ చేశారు ఓవైసీపీ చాలా జాబితా చెప్పారు… చివరికి నెక్లెస్ రోడ్ గురించి కూడా చెప్పారు. కానీ అసలు ఆయన బాధ మాత్రం వేరే.
ఓవైసీ బ్రదర్స్ , ఆయన బంధువులు పాతబస్తీలో చెరువులను కబ్జా చేసిన వాళ్లలో ముందు వరుసలో ఉంటారు. ఆయన ఆస్పత్రులు, కార్యాలయాలు చాలా వరకూ కబ్జాలే. ఆదివారం బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కళాశాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కాలజీ గూగుల్ మ్యాప్ చూస్తే మజ్లిస్ కుటుంబం ఎంత బరితెగించి చెరువును కబ్జా చేసిందో అర్థమైపోతుది. నడి చెరువులో ఆ కాలేజీ ఉంటుంది. దానిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దాన్ని కూల్చివేస్తారన్న భయంతోనే ఓవైసీ హైడ్రాకు వ్యతిరేకంగా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టారు.
ఎలాంటి భవనాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రేవం త్ రెడ్డి స్పష్టం చేశారు. అతి ఓవైసీ అయినా సరే అన్నట్లుగా ఆయన ఉన్నారు. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిపాలన చేస్తున్నానని ప్రజలే అండగా ఉంటారని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓవైసీ మీద ఆధారపడేం లేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఓవైసీ సన్నిహితంగా ఉంటారు. అందుకే… రేవంత్ కూడా… స్నేహంగానే ఉంటున్నా… ఇలాంటి కబ్జాలను చూసీ చూడనట్లుగా వదిలే అవకాశం లేదని చెబుతున్నారు.
ఓవైసీపీకి అందుకే టెన్షన్ ప్రారంభమయింది. తన భవనాలు కూల్చేస్తే ఎలా అని ఆయన మథనపడుతున్నారు. కానీ అక్కడ ఉంది కేసీఆర్ కాదన్న సెటైర్లు అప్పుడే వినిపిస్తున్నాయి. హైడ్రా ఓవైసీ విషషయంలో ఏం చేయబోతోందన్నది కీలకం.