హైడ్రా దూకుడు… అక్ర‌మ నిర్మాణాల‌కు బ్రేక్ ప‌డుతుందా?

తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ త‌న ప‌నిని ప్రారంభించింది. ముందుగా చెరువులు, నాలాలు క‌బ్జా చేసి… అధికారుల‌ను మేనేజ్ చేసి నిర్మించిన నిర్మాణాల‌ను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. అధికారులు, నాయ‌కుల ఒత్తిడుల‌కు త‌లొగ్గ‌కుండా కొన్ని రోజులుగా కూల్చివేత‌లు కొన‌సాగుతున్నాయి.

ఓల్డ్ సిటీకి చెందిన ఓ ఎంఐఎం ఎమ్మెల్యే భ‌వ‌నాన్ని కూడా హైడ్రా కూల్చివేసింది. పై నుండి ఫోన్స్ వ‌స్తాయ‌ని బెదిరించినా, కూల్చివేత‌లు ఆగ‌లేదు. అలాగే… న‌గ‌ర శివారు ప్రాంతాల్లో రోజుకో చోట నిర్మాణాల కూల్చివేత కొన‌సాగుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు కూల్చివేత‌ల‌కే పరిమితం అయిన హైడ్రా త్వ‌ర‌లో హైడ్రా పోలీస్ స్టేష‌న్స్ కూడా స్టార్ట్ చేయ‌బోతుందని స‌మాచారం. హైడ్రా స్పీడ్ తో మా ఏరియాల్లో చెరువులు క‌బ్జా అయ్యాయి అంటే మా ఏరియాల్లో క‌బ్జా అయ్యాయ‌ని పొలిటీష‌న్స్ నుండి సాధార‌ణ వ్య‌క్తుల వ‌ర‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇంతవ‌ర‌కు బాగానే హైడ్రాలో నియ‌మించే అధికారులు ఎంత‌వ‌ర‌కు నిక్క‌చ్చిగా ఉంటారు అన్న‌ది అస‌లు స‌మ‌స్య కాబోతుండ‌గా… హైడ్రాను రాజ‌కీయక‌క్ష సాధింపుల‌కు వాడుకుంటారా? ప్ర‌త్య‌ర్థుల ఆస్తులు, వ్యాపారాల‌పై ప్ర‌యోగిస్తారా అన్న అనుమానాలు కూడా లేక‌పోలేదు.

అయితే, ఎక్క‌డో ఒక చోట మొద‌ల‌వ్వాలి కాబ‌ట్టి హైడ్రా ఉద్దేశం మంచిదే… ఎంత‌వ‌ర‌కు ఆచ‌ర‌ణ‌లో ముంద‌డుగు ప‌డుతుంద‌ని చూడాల‌న్న వారు కూడా లేక‌పోలేదు.

మున్సిప‌ల్, రెవెన్యూ శాఖ‌ల్లో తీవ్ర‌మైన అవినీతి ఉంది… అక్ర‌మ నిర్మాణాల‌న్నీ వీరి అవినీతి వ‌ల్లే అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు హైడ్రా స్పీడ్ చూస్తుంటే బ్రేకులు ప‌డుతున్న‌ట్లే ఉంది కానీ ఎంత వ‌ర‌కు కంటిన్యూ అవుతుంద‌నేదే అస‌లు ప్ర‌శ్న!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close