హైడ్రా దూకుడు :నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కూ టెన్షన్

హైడ్రా చీఫ్‌గా రంగనాథ్‌కు సీఎం రేవంత్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన ముందుగా చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టి… ఆక్రమణ అని తేలిన వాటన్నింటినీ కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున చెందిన ప్రముఖ ఫంక్షన్ హాల్.. ఎన్ కన్వెన్షన్ కూ గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై పదేళ్ల క్రితం .. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్యలు ప్రారంభించారు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి.

ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనా 44 ఏళ్ళలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక తెప్పించుకున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విర్తీర్ణం.. ప్రస్తుత విస్తీర్ణంతో వివరాలు సేకరించారు. ఇందులో ఎన్ కన్వెన్షన్ ఉన్న తుమ్మిడికుంట కూడా ఉంది. దీని ఆధారంగా హైడ్రా కూల్చివేతలకు సిద్దమైంది. అప్పట్లో కేసీఆర్.. బుల్ డోజర్లను పంపినప్పటికీ.. తదుపరి జరిగిన పరిణామాలతో వెనక్కి పోయాయి. ఇప్పుడు రంగనాథ్‌ ఏం చేస్తారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close