హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు చాలా పెద్ద రేంజ్ లో ఉన్నాయని కమిషనర్ రంగనాథ్ నమ్మకంతో ఉన్నారు. త్వరలో ఆర్డినెన్స్, ఆ తర్వాత చట్టం చేస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ కేబినెట్ నిర్ణయం ద్వారా హైడ్రా ఏర్పాటయింది. దీనికి చట్టబద్దత కల్పించాల్సి ఉంది. ప్రస్తుతానికి చట్టబద్దత లేదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. అందుకే హైడ్రా దూకుడు తగ్గించి. చట్టబద్దత కల్పించేందుకు కసరత్తును ప్రారంభించారు.
హైడ్రాకు సూపర్ పవర్స్ ఇచ్చే దిశలో కోర్టులు కూడా ఉండాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ట్రైబ్యునల్స్కు కోర్టు హోదా ఉంటుంది. హైడ్రాకు కూడా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశ్రాంత న్యాయమూర్తుల్ని నియమిస్తారు. దీంతో హైడ్రా కు సంబంధించిన ప్రతి పిటిషన్ ను ట్రైబ్యునల్ లో దాఖలు చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ట్రైబ్యునల్ భవనాల యజమానులకే ఎక్కువ ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రంగనాథ్.. హైడ్రా మిషన్ మీద పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి తనకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారని అనుకుంటున్నారు. అందుకే ఆయన హైడ్రా విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల గురించి చెబుతున్నారు. నిజానికి రంగనాథ్.. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా పేరుంది. అందుకే ఎన్నికల సమయంలో విధుల్ని కూడా ఈసీ తప్పించింది. రేవంత్ బాధ్యతలు తీసుకున్నాక కూడా ఆయనకు ప్రాధాన్య పోస్టు దక్కలేదు. తర్వాతేం జరిగిందో కానీ.. ఆయనే ఇప్పుడు పవర్ ఫుల్ అయ్యారు.