హైడ్రామా కమిషనర్ రంగనాథ్ పూర్తిగా తనను తాను నియంత్రించుకున్నారు. పెద్ద ఎత్తున సమీకరించుకున్న బుల్డోజర్లకు పని లేకుండా చేశారు. ఎప్పుడో ఒకటి బయటకు తీస్తున్నారు. అలా తీస్తున్న బుల్డోజర్లతో విషయంలోనూ ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయన ఖాజాగూడలో ఓ చెరువును ఆక్రమిస్తే…కూల్చివేశారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఆయనపై విరుచుకుపడ్డారు. అలా ఎలా కూల్చేస్తారని .. జైలుకు పంపుతానని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ పై ఇలా హైకోర్టు విరుచుకుపడటం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ అంతే.
హైకోర్టు వ్యాఖ్యలపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా రూల్స్ .. చట్టం గురించి చెప్పారు. నీటి వనరుల్ని ఆక్రమిస్తే నోటీసులు ఇవ్వాల్సిన పని లేదన్నారు. అయినప్పటికీ నోటీసులు ఇచ్చామని వారు ఖాళీ చేయలేదంటున్నారు. హైకోర్టు స్పందన చూస్తే హైడ్రా అసలు ఎక్కడ కూల్చివేతలు చేపట్టినా ఇక సహించేది లేదన్నట్లుగా ఉంది. కానీ రంగనాథ్ మాత్రం తనకు వచ్చిన ఫిర్యాదుల్ని .. అందులో నిజాల్ని బేరీజు వేసుకుని చర్యలు తీసుకుంటున్నారు.
రంగనాథ్ తన రోల్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. చాలా పవర్స్ ఇచ్చారని వాటితో చేయాలనుకున్నది చేయాలనుకుంటున్నారు. ఎన్ని పరిమితులు పెట్టినా కొన్ని ఆక్రమణల విషయంలో ఎవరు చెప్పినా తగ్గడం లేదు. ఆక్రమణలపైనా చర్యలు తీసుకోకుండా హైడ్రాను నిలువరిస్తే ఆయన కూడా ఏమీ చేయలేరు. ఆక్రమణదారులే పేదలే పేరుతో చేయాల్సినదంతా చేస్తారు. అటు విధులు.. ఇటు హైకోర్టు ఆగ్రహం మధ్య ప్రస్తుతం హైడ్రా కమిషనర్ ఒత్తిడికి గురవుతున్నారని అనుకోవచ్చు.