ఆస్తుల కోసం జగన్ రెడ్డి చేస్తున్న అడ్డగోలు ఆరోపణలతో షర్మిల మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇక జగన్ రెడ్డి గురించి ఐ డోంట్ కేర్ అని తేల్చి చెప్పేశారు. ఆస్తులు ఇస్తాడా లేదా అన్నది తాను పట్టించుకోనని.. కానీ తల్లి మీద కేసు వేసిన వాడుగా మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతాడని తేల్చారు. ఆస్తుల పంపకం విషయంలో జగన్ స్వయంగా MOU లో సంతకం పెట్టారని .. ఆస్తులు ఎవరికి ఏవి అనేది సంతకం చేశారని షర్మిల గుర్తు చేశారు. ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. గిఫ్ట్ ఇచ్చింది నాకు కాదు.. తల్లి విజయమ్మకు అని గుర్తు చేశారు. ఇచ్చిన షేర్లను వెనక్కి అడుగుతున్నారని విమర్శించారు.
ఎన్సీఎల్టీలో జగన్ వేసిన అఫిడవిట్ విషయంపైనే ఇలా స్పందించారు. తాను సంతకం పెట్టాను కానీ ఇంకా పత్రాలు తన దగ్గరే ఉన్నాయని..తాను గిఫ్ట్ ఇవ్వలేదని జగన్ వాదిస్తున్నారు. గిఫ్ట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా తన తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని ఆయన అంటున్నారు. ఆయన వాదన చిన్న పిల్లల మాదిరిగా .. తనకు తల్లి, చెల్లిపై ప్రేమాభిమానాలు పోయాయి కాబట్టి గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నట్లుగా వాదించారు. ఇలాంటి వాదనలను జగన్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి ఎలా వినిపించారో కానీ.. అవన్నీ జగన్ మాటలన్నట్లుగానే చెప్పారు.
మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు జగన్ కాజేస్తున్నారని షర్మిల పదే పదే చెబుతున్నారు. అయితే జగన్ ఆస్తులన్నీ వైఎస్ సీఎం అయ్యాక క్విడ్ ప్రో కో ద్వారా సంపాదించుకున్నవే. ఊహించనంత సంపదను అక్రమంగా కూడగట్టారు. అవన్నీ ఇప్పుడు జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తుల్లో వాటా చెల్లికి కూడా వస్తుందని వైఎస్ బతికున్నప్పుడు హామీ ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం ప్లేట్ తిప్పి.. తన కోసం..తన పార్టీ కోసం పని చేసిన చెల్లిని మోసం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.