ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఐ ప్యాక్ మీద ఆధారపడుతోందని అందరికీ తెలుసు. కులాల మధ్య చిచ్చులు పెట్టడం దగ్గర్నుంచి వైసీపీకి అవసరమైన అన్ని రకాల పనులూ చేస్తోందని అందరికీ తెలుసు. అయితే కొత్తగా ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై దాడులు, హత్యలు వంటి వాటికి కూడా ప్రణాళిక లు ఇస్తోందని దగ్గరుండి వాటిని ఎలా అమలు చేయాలో కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారన్న విషయం బయటపడింది. ఇది కూడా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనలోనే సాక్ష్యాలు వెల్లడయ్యాయి.
ఎర్రగొండపాలెంలో టీడీపీ రాళ్లు విసరడంతో ముగ్గురు వైసీపీ నేతలకు గాయాలయ్యాయని మంత్రి సురేష్ ఆరోపిస్తున్నారు. ఇద్దరి పేర్లు చెబుతున్నారు కానీ మూడో పేరు చెప్పడం లేదు. ఆ మూడో వ్యక్తి ఐ ప్యాక్ వ్యక్తి. ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాడి ఘటన జరుగుతున్నప్పుడు సురేష్ కు ప్లాన్ వివరిస్తూ.. ఏం చెయాలో చెబుతూ కొన్ని వీడియోల్లో కనిపించారు. తర్వాత గాయపడి సురేష్ ఆఫీసులో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అతను ఐ ప్యాక్ ఉద్యోగి అని స్పష్టంగా తెలియడంతో ఇప్పుడు గగ్గోలు రేగుతోంది.
ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం.. కుల చిచ్చు పెట్చేలా వ్యవహరించడంతో పాటు టీడీపీ నేతల హత్యలకూ వీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్ల దాడులు హత్య చేసేందుకేనన్న అనుమానాలను ఇప్పటికే టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. చంద్రబాబుపై రాళ్ల దాడి పక్కా ప్లాన్ అని దీనిపై ఖచ్చితంగా విచారణ చేయించాలని అంటున్నారు. ఈ విషయంలో ఎన్ఎస్జీ అధికారులు ఇప్పిటికే ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక పోలసులే కుట్ర దారులుగా ఉన్నారన్న అనుమానంతో వారు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో పాలకులపై తీవ్ర అభియోగాలుఉన్నాయి. ఊహించనంత నేర చరిత్ర ఉంది. సొంత కుటుంబసభ్యుడ్ని అత్యంత దారుణంగా చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కుటుంబసభ్యుడ్ని కాపాడేందుకు వ్యవస్థ మొత్తాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఎన్ఎస్జీ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.