తమిళనాట అన్నాడీఎంకే చిందర వందరగా మారిపోయింది. పన్నీర్ సెల్వం, పళనీ స్వామి వర్గాలు పార్టీపై పట్టు కోసం ఎవరికి వారు పోరాడుతున్నారు. చివరికి పళనీ స్వామి పైచేయి సాధించారు. తాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యి.. పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే అంత తేలిగ్గా పన్నీ ర్ సెల్వం బయటకు పోరు .. ఆయన అనుచరులతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో చివరికి ఆ కార్యాలయాన్ని రెవిన్యూ శాఖ సీజ్ చేసింది. ఈ పరిమామాలతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయినట్లయింది.
అయితే ఈ వ్యవహారాలకు మూలం బీజేపీ. ఆ బీజేపీ ఇప్పుడు అన్నాడీఎంకే సినిమాను ఆస్వాదిస్తూ కూర్చుంది. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనను తొలగించి శశికళ సీఎం అవ్వాలనుకున్నారు. కానీ పన్నీర్ తిరుగుబాటు చేశారు. శశికల జైలుకెళ్లారు. చివరికి పళని స్వామి సీఎం అయ్యారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ పళనీ, పనీర్‌కు రాజీ చేసి ప్రభుత్వాన్ని నడిపించింది. ఈ మొత్తం వ్యవహారలో బీజేపీ సూత్రధారి, పాత్రధారి. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశారు. ఓడిపోయాక.. బీజేపీ అసలు రాజకీయం ప్రారంభించారు.
ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. మరో వైపు బీజేపీ తామే అసలైన ప్రతిపక్షం అన్నట్లుగా పోరాడుతోంది. అన్నామలై అనే మాజీ ఎన్నాడీఎంకే నేతను తమిళనాడు బీజేపీ చీఫ్ ను పెట్టుకుని వారి క్యాడర్‌ను కూడా ఆకర్షిస్తోంది. బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా ఈపీఎస్, ఓపీఎస్ ఎవరి పోరాటం చేస్తున్నారు. త్వరలో ఈ పార్టీ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుందేమో అన్నంతంగా అక్కడ రాజకీయం మారిపోతోంది.