ఆర్థరాత్రి పూట ఓ డిప్యూటీ తహశీల్దార్ … తెలంగాణ సీఎంవోలో కీలక బాధ్యతలు మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ మహిళా ఐఏఎస్ స్మితా సభర్వాల్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తనకు గత రాత్రి ఓ భయానక ఘటన ఎదురైందని..ఓ ఆజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి ప్రవేశింంచాడని.. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రాణాల్ని కాపాడుకున్నానని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని.. ఇంటి తలుపులు , డోర్లు కరెక్ట్ గా వేశారో లేదో చూసుకోవాలని ఆమె నెటిజన్లకు సలహా ఇచ్చారు.
అనంద్ కుమార్ రెడ్డి అనే డిప్యూటీ తహశీల్దార్ నిన్న రాత్రి ఆమె ఇంట్లొకి చొరబడ్డారు. తలుపులు తీసుకుని నేరుగా లోపలికి వెళ్లిపోయారు. స్మితాసభర్వాల్ ఆ వ్యక్తిని గమించి గట్టిగా కేకలేశారు. దాంతో భద్రతా సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. అతను మరో వ్యక్తితో కలిసి స్మితా సభర్వాల్ ఇంటికి వచ్చినట్లుగా గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. డ్యూటీ గురించి మాట్లాడటానికి వచ్చానని ఆ డిప్యూటీ తహశీల్దార్ చెబుతున్నారు. కానీ అర్థరాత్రి పూట ఇంటికి వెళ్లడంపై ఏదో దురుద్దేశం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్మితా సభర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్లో తరచూ ఫోటోలు పెట్టి స్పందిస్తూ ఉంటారు. ఈ ట్విట్టర్ ను తాను ఫాలో అవుతున్నానని… ఆమె ఫోటోలను షేర్ చేశానని ఆనంద్ కుమార్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై పోలీసులు గుంభనంగా ఉన్నారు. కేసు నమోదవబట్టే అసలు విషయం బయటకు తెలిసింది. డిప్యూటీ తహశీల్దార్ గా ఉన్న ఆనంద్ కుమార్ రెడ్డికి.. ఆ మహిళా ఐఏఎస్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నదానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.