ప్రభుత్వం మారితే అప్పటి వరకూ ఉన్న అధికార పార్టీ నేతలు కంగారు పడాలి. కక్ష సాధింపులు ఉంటాయేమో అని. కానీ ఇప్పుడు అధికారులు కూడా కంగారు పడాల్సి వస్తోంది. ఎందుకంటే… కొంత మంది అధికారులు పార్టీ నేతలుగా మారి… సేవలు చేశారు మరి. అలాంటి వారిలో బీఆర్ఎస్ సర్కార్ లో కొంత మంది పేరు పడిపోయారు. కేటీఆర్ కు జయేష్ రంజన్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. కేటీఆర్ హాజరు కావాల్సిన కొన్ని కార్యక్రమాలకు కూడా ఆయనే హాజరయ్యేవారు.
అలాగే సీఎంవోలో స్మితా సభర్వాల్ పాత్ర చాలా కీలకం. తెలంగాణ ఏర్పరిచినప్పుడు మెదక్ కలెక్టర్ గా ఉన్న ఆమె కన్నీరుపెట్టుకున్నారు. అవి వైరల్ కావడంతో బీఆర్ఎస్ నేతల దగ్గర గుర్తింపు లభించింది. సీఎంవోలో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. పదేళ్లుగా సీఎంవోలో ఆమె చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ కూడా ఆమె దగ్గరే ఉంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ను ఓ సంస్థకు ధారాదత్తం అర్వింద్ కుమార్ అనే ఐఎఎస్తో పాటు మరికొంత మంది అధికారులు… సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కలవలేదు. గతంలో రేవంత్ ఈ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఊహించని విధంగా ప్రభుత్వం మారిపోవడంతో ఆ అధికారులకు గడ్డు ప రిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిని కూడా కవలలేనంతగా అధికార పార్టీతో.. నేతలతో సన్నిహితంగా వ్యవహరించడం ఎందుకని.. అధికారం పోతే కంగారు పడాల్సివస్తుందని ముందుగానే ఆలోచించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.