జగన్ రెడ్డికి కావాల్సినట్లుగా సైకో తరహాలో పని చేసి ఆయన అభిమానాన్ని పొందిన ప్రవీణ్ ప్రకాష్.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అలాగే వ్యవహరిస్తున్నారు. తాను చేసిన నిర్వాకాలకు పోస్టింగ్ ఇస్తారో లేదోనని టెన్షన్ పడుతూనే… బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తాను స్వచ్చంద పదవీ విరమణ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఆయన తీరు సచివాలయంలో నవ్వుల పాలవుతోంది.
రెండు రోజుల కిందట చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కు ప్రవీణ్ ప్రకాష్..తాను వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశానని ఆమోదించాలని మెసెజ్ పెట్టారు. ఆ మెసెజ్ చూసి సరే అని ఆయన ఫైల్ వచ్చందేమో కనుక్కున్నారు నీరబ్ కుమార్. కానీ ఎక్కడా రాలేదు. ఆరా తీస్తే.. ఓ తెల్ల కాగితంపై స్వచ్చంద పదవీ విరమణ అంటూ రాసి . పోస్టు బాక్సులో వేసి వెళ్లారు. దాన్ని ఎలా ఆమోదిస్తామని ఫార్మాట్ ప్రకారం పంపాలని సీఎస్ కార్యాలయ అధికారులు కోరారు.
అయితే పదవీ విరమణ ఎందుకు పోస్టింగ్ ఇస్తామని బుజ్జగిస్తారని ప్రవీణ్ ప్రకాష్ అనుకున్నారేమో కానీ… ఇలా ఫార్మాట్ లో పంపాలని కోరడంతో షాక్ కు గురయ్యారు. అయితే తగ్గలేరు కాబట్టి ఫార్మాట్ లో పంపారు. కానీ ఈ సారి సంతకం చేయలేదు. డిజిటల్ సంతకం కాపీ పేస్ట్ చేశారు. అది చెల్లుబాటు అవుతుందో లేదోనని పరిశీలిస్తున్నారు. ఆయనను పంపేయాలనుకుంటే ఆమోదించే అవకాశం ఉంది. ఆ ఐఏస్ రాజీనామా ఆమోదం రాష్ట్రం చేతుల్లోనే ఉంటుంది.
గతంలోనూ జగన్ ప్రభుత్వాన్ని ఇలానే స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి పోతున్నట్లుగా మీడియాకు చెప్పారు. తర్వాత జగన్ పిలిచి మళ్లీ కీలక శాఖ ఇచ్చారు. ఇప్పుడీ బెదిరింపుల్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకునే అవకాశాల్లేవు.