వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తుల్ని కొట్టేయడంలో వైసీపీ నేతలు అన్ని రకాల ఘోరాలు చేశారు. అవి ఇప్పుడు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గత ఏడాదిన్నర కాలంగా పరారీలో ఉన్న మాజీ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనపై గత ఏడాది ఏసీబీ దాడులు జరిగాయి. అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా గుర్తించారు. అలా సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన ఇంటి వెనుక నుంచి పారిపోయారు. పారిపోవడానికి వైసీపీ నేతలు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నం చేయలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్న సమయంలో ఈ రిజిస్ట్రార్ సింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది . దీంతో ప్రత్యేక నిఘా పెట్టి అరెస్టుచేసి తీసుకువచ్చారు. ఆయన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను పారిపోవడానికి గల కారణాలను ఆయన ఏసీబీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తనతో వైసీపీ నేతుల ఎన్నో తప్పులు చేయించాలని.. అవన్నీ బయటపెడతానని ఏసీబీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్‌గా తాను ఉన్నప్పుడు గత ప్రభుత్వానికి చెందిన కొంత మంది ముఖ్యులు తనను బెదిరించి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లో విలువైన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు. ఆయన చెబుతున్న ఆస్తులు ఏమిటన్నదానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని రిజిస్ట్రేషన్లకు అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ..తన కుమారుడు వద్ద నుంచి కోటి రూపాయలు వసూలు చేసిన తర్వాతే విడుదల చేశారు.
రిజిస్ట్రార్ సింగ్ రూ. 700 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను వేరే వారిపై బదలాయించారు. ఇందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, జగన్ పిఎ కె నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ అతని భార్య జబర్దస్త్ నటి వనం దివ్య @ రీతు చౌదరి పేర్లపై రిజిస్ట్రేషన్ సింగ్ అంటున్నారు ఈ మేరకు ఏసీబీకి పూర్తి వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు బయటకు తెలిస్తే వైసీపీలోనే బడాబాబుల వ్యవహారం ముదిరి పాకాన పడుతుందని అంటున్నారు.