విగ్రహాలను తానే ధ్వంసం చేశానని స్వయంగా ప్రకటించుకున్న తూర్పుగోదావరి జిల్లాలోని ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. 35 ఏళ్లలోపే ఉన్న ఆ పాస్టర్ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అయితే ఇప్పుడు అతని ఆస్తులు దాదాపుగా రూ. వెయ్యి కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అతనికి ఎలాంటి వ్యాపారం లేదు. ఉన్న వ్యాపారం అల్లా మత మార్పిళ్లు చేసి.. విదేశాల నుంచి నిధులు రాబట్టుకోవడమే. దీనికి సంబంధించి ప్రవీణ్ ఆడియో టేపులు పోలీసులకు చేరాయి. తానే హిందూ దేవల విగ్రహాలను ధ్వంసం చేశారని.. క్రిస్టియన్ విలేజ్‌లు మార్చేందుకే ఈ పని చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్నారు. దీంతో పోలీసులు ఇప్పటికే ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి.. ఆతని చిట్టా వెలుగులోకి తెస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆస్తుల జాబితా చూసిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మినట్లుగా అయింది. ఆయన స్కూళ్లు నడుపుతున్నారు. అనాధలు, అంథ విద్యార్థుల పేరుతో వివిధ స్కూళ్లు నడుపుతున్నారు. కళ్లు లేని వారి కోసం ఏర్పాటు చేసిన స్కూల్లో అంధ విద్యార్థులెవరూ లేరు. స్కూళ్లన్నీ… పది నుంచి ఇరవై ఎకరాల స్థలాల్లో ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా కూడబెట్టారు. ఈ ఆస్తులన్నీ మార్కెట్ విలువలో వెయ్యి కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో నగదు ఎలా వచ్చిందో పోలీసులు ఆరా తీస్తున్నారు.
విగ్రహాలను ధ్వంసం చేసి.. మత మార్పిళ్లు చేస్తున్నానని చెప్పి ఇతర దేశాల క్రైస్తవ మిషనరీల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి ఏ మార్గంలో వస్తున్నాయనేది సస్పెన్స్‌గామారింది. పాస్టర్ ప్రవీణ్… బ్రదర్ అనిల్‌కు చెందిన మత ప్రచార సంస్థతో సన్నిహితంగా ఉంటారు. ఇలాగే వైసీపీ నేతలతోనూ ఆయన చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వైనం… పిఠాపురం ప్రాంతంలో ప్రజంలదరికీ పరిచితమే. ఇప్పుడు.. ఆయన లెక్కలన్నీ బయటకు తీస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే.. పాస్టర్ ప్రవీణ్ ను అరెస్ట్ చేసినప్పటి నుండి ఏపీలో సీన్లు మారిపోతున్నాయి. విగ్రహాలపై దాడి ఘటనలో.. రాజకీయకుట్ర లేదని ప్రకటించిన డీజీపీ.. రెండు రోజులకే మాట మార్చి… టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టించారు. వాటిలో ఎక్కువగా సోషల్ మీడియా ప్రచారాల గురించే ఉన్నాయి. ఈ పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం హైలెట్ కాకుండా.. ప్రభుత్వం ఈ వ్యూహం అమలు చేస్తోందన్న చర్చ జరుగుతోంది.