వైఎస్ విగ్రహాల కోసం పద్దెనిమిది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేశారు. అదేదో స్టాట్యూ ఆఫ్ యూనిటీలాగా.. స్టాట్యూ ఆఫ్ డివైడింగ్ స్టార్ అని ఇడుపులపాయను చేద్దామనుకున్నారో కానీ.,. మొత్తానికి పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి.. రకరకాల విగ్రహాలతో ఇడుపులపాయ స్మృతి వనాన్ని నింపేశారు. ఆ కాంట్రాక్టులు తీసుకుని జగన్ రెడ్డి చుట్టాలే. వారి కొంచెం మెక్కేసి… కొంచెం కమిషన్లు ఇచ్చి.. మిగతా వాటితో విగ్రహాలు తెచ్చి పెట్టారు. అందుకే నాలుగైదు లక్షలు కాని వాటితో కోట్లకు బిల్లులు పెట్టి టెండరేశారు.
ఓ వైపు తాడేపల్లిలో సొంత ఇంటికి వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి సోకులు చేయించారు… రెండో సారి గెలిస్తే ఉండటానికి రుషికొండపై ఆరు వందలకోట్లతో ప్యాలెస్ కట్టించుకున్నారు. ఇడుపులపాయలో ప్రజాధనంతో విగ్రహాలు పెట్టేశారు. ప్రజాధనాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం మొహమాటపడలేదు. రెండు కోట్లు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో ఓ రోడ్డు తాను గెలిచేవాడ్నని.. మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ భోరుమంటున్నారు. ఆయన లాంటి బాధే ఇతర వైసీపీ నేతలది.
జగన్ రెడ్డి నిర్వాకాలతో తాము ఓడిపోయామని వైసీపీ ఎమ్మెల్యేలకూ తెలుసు. ప్రజలకు ఇంకా తెలుసు. ప్రజల్ని గాలికి వదిలేసి..ఖజానాలో ఉన్న సొమ్ములో కొంత చిల్లర ఓటు బ్యాంక్ పేరుతో కొంత మందికి పంచి.. మిగతా అంతా నొక్కేయాలనుకున్నారు. కానీ మొదటికే మోసం వచ్చింది. కానీ జరిగిపోయిన నష్టం భరించాల్సింది ప్రజలే.