కేంద్రంలో బీజేపీ ముందస్తుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. జమిలీ ఎన్నికల కోసం జనవరిలోనే ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరగాల్సిన ఒడిషా , ఏపీ ప్రభుత్వాలవైపే ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కూడా డిసెంబర్ లేదా జనవరి ఎన్నికలకు అంగీకరించాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు వస్తాయి. బీజేడీ తరపున నవీన్ పట్నాయక్ అంగీకరించారని ఆ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. ఏపీలో సీఎం జగన్ కూడా .. ,బీజేపీ ఏం చెబితే అది చేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
బీజేపీ ప్రేమిస్తే .. ప్రేమించక తప్పదన్నట్లుగా.. తాము ముందస్తుకు వెళ్తే.. కలసి రావాల్సిందేనని చెబితే వెళ్లక తప్పదు. కాదు కూడదనే ఆలోచన అసలు రానీయకూడదు అలా వస్తే ఎదురయ్యే పరిణామాలను ఊహించలేరు. అందుకే ప్రజలు అవకాశం ఇచ్చిన చివరి రోజు వరకూ పాలన చేస్తామని సజ్జల వంటి వారు చెబుతున్నా… ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చే సంకేతాలను పాటిస్తామని.. బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు వస్తే తాము రెడీనేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతే కానీ ముందస్తుకు వెళ్లబోమని మాత్రం అనడం లేదు. కానీ జమిలీ ఎన్నికలు అంటే… వైసీపీలో కాస్త కంగారు ఉంది. అందుకే.. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు విస్తృత చర్చ జరగాలని.. ఏకాభిప్రాయం సాధించాలని అంటున్నారు.
కానీ దేశంలో ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం రాదు. ఆ విషయం వైసీపీకి తెలియక కాదు. ముందస్తుకు వెళ్లడం ఇష్టం లేక. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తీసుకునే నిర్ణయం ఆధారంగానే .. జగన్ కూడా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయన సొంత అభిప్రాయాలకు తావు లేదని అనుకోవచ్చు.