జగన్ రెడ్డి సీఎం కావడానికి నానా గడ్డి కరిచిన విజయసాయిరెడ్డి ఆయన కళ్లు,ముక్కు,చెవులు కూడా. అలాంటి రెడ్డి ఇప్పుడు పదవిని సైతం వదిలేసి నేను పోతా అని వెళ్లిపోతున్నాడు. పొలం పనులు చేసుకుంటానని నన్ను వదిలేయాలని వేడుకుంటున్నాడు. ఆయనే అలా అంటున్నారంటే ఇక మిగతా వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. అందరూ తమ దారి తాము చూసుకునే పనుల్లో ఉంటారు. అందులో సందేహం లేదు.
జగన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉందని వైసీపీ నేతలు ఎవరూ అనుకోవడం లేదు. ఆయనపై కేసులు ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమయిందన్న చర్చ జరుగుతోంది. ఓ హై ప్రోఫైల్ కేసులో పదకొండేళ్లుగా ట్రయల్ స్టార్ట్ కాకపోవడం న్యాయవ్యవస్థకే అవమానమన్న చర్చ ప్రజల్లో నడుస్తోంది. కేసుల్ని వేగంగా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ కేసులు మరో రెండేళ్లలో తేలిపోయినా ఆశ్చర్యం లేదు. కొత్త కేసులు ఆయన కోసం రెడీగా ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన పాత్రేమిటో తేలాల్సి ఉంది. ఇలా చూస్తే జగన్ భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది.
మరో వైపు పార్టీ నేతలు చాలా మంది పాలనలో చేసిన నిర్వాకాల కారణంగా తాము జగన్ తో ఉంటే నిండా మునిగిపోతామని అంచనాకు వచ్చారు. అందుకే వేరే దారి చూసుకుంటున్నారు. చివరికి చాలా మంది నేతలు షర్మిలతోనూ టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. జగన్ జైలుకెళ్తే ఆ పార్టీకి నాయకత్వం వహించడానికి సజ్జల మాత్రమే ఉంటారు. ఇక ఆ పార్టీ ఉంటుందని ఎవరూ అనుకోరు. షర్మిల కొంత లాభపడే అవకాశం ఉంది .ఎలా చూసినా జగన్ రెడ్డి జైలుకెళ్లిన రోజున వైసీపీ పని అయిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.