వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. పివిపి పతాకంలో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న సినిమా ‘ఊపిరి’. మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. నాగార్జున, కార్తి కలిసి చేసిన ఈ సినిమా మల్టీస్టారర్ సినిమాకు సరికొత్త అర్ధం చెప్పబోతుంది.
ఈ సినిమా రిలీజ్ సమయంలో మిగతా హీరోల కన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడ్డాడని అంటున్నారు సిని జనాలు. అదేంటి ఊపిరి రిలీజ్ కు ఎన్టీఆర్ కు ఏంటి సంబంధం అంటే కచ్చితంగా ఉంది అంటున్నారు. ఎందుకంటే అసలు కార్తి నటించిన రోల్ కు ముందు ఎన్టీఆర్ నే సంప్రదించారట దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత పివిపి. కాని డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని ఆ సినిమాకు సారీ చెప్పేశాడు యంగ్ టైగర్.
అయితే సినిమా ట్రైలర్, పోస్టర్స్ చూస్తుంటే ఎన్టీఆర్ మంచి సినిమాను మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలుగక తప్పదు. అంతేకాదు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్ది ఎన్టీఆర్ పై సినిమా ప్రభావం బాగా చూపెడుతుంది. ఊపిరి రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే జూనియర్ తప్పకుండా మంచి సినిమా మిస్ అయ్యాయని బాధపడక తప్పదు. అందుకే ఎన్టీఆర్ ఊపిరి బిగపట్టుకుని నాగార్జున. కార్తిల సినిమా కోసం ఎదురుచూస్తున్నాడన్నమాట.