చిరంజీవి నూటయాభయ్యవ చిత్రంగా తమిళ రీమేక్ కత్తికి సంబంధించిన వివాదం గతంలోనే పరిష్కారమైనట్టు ఒక ప్రముఖ సినీ రచయిత గతంలోనే నాతో చెప్పారు. ఆ చిత్రానికి వారే రచన చేస్తారన్న అభిప్రాయం పరిశ్రమలో వుంది. తాను, దాసరి నారాయణ రావు పరిష్కారం కుదిర్చామని కొద్దికాలంలోనే ప్రకటిస్తామని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి మరెవరైనా నిర్మాత అయితే ఎప్పుడో మొదలై వుండేదని కుమారుడు రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మాత కావడం ఆలస్యానికి దారి తీస్తున్నదని అభిప్రాయం వెలిబుచ్చారు. అతి జాగ్రత్త , అతనికి వున్న సినిమాలు రెంటినీ ఒకే సారి ప్రారంభించాలన్న కుతూహలం అన్నీ కలసి ఈ జాప్యానికి దారితీశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
జీవితంలోనూ ఫార్ములాలు!
మామూలుగా కమర్షియల్ సినిమాల్లో కొన్ని ఫార్ములాలను అనుసరిస్తుంటారు. అయితే నిజ జీవితంలోనూ సినిమా వాళ్లు కొన్ని ఫార్ములాలను పాటిస్తుంటారు. గ్లామర్ వుంటుంది గనక వారేం చేసినా ప్రచారం వచ్చేస్తుంటుంది. సర్దార్ సెట్ చూసేందుకు చిరంజీవి వెళ్లారనే వార్త బాగానే ప్రచారం పొందింది. కాస్త రీవైండ్ చేస్తే 2015 అక్టోబరులో చిరంజీవి తన కుమారుడు రామ్చరణ్ హీరోగా చేసిన బ్రూస్లీ సినిమాలో ఒక డాన్సు ఫైటు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత తెరపై నటించిన అన్నయ్యను అభినందించడానికంటూ తమ్ముడు వెళ్లికలిశాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు. అన్నదమ్ముల అనుబంధంతో పాటు బోలెడు పబ్టిసిటీ! స్టార్ క్రేజ్.