డబ్బులు తీసుకుని మరీ చంద్రబాబు, పవన్ పై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పట్టిన ఆర్జీవీకి కోర్టులోనూ ఊరట దక్కలేదు. దాంతో ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుటహాజరు కావాల్సి ఉంది. హారు కాకపోతే ఆయన విచారణకు సహకరించడం లేదని పోలీసులు నమోదు చేసుకుని .. రాత్రికి రాత్రికి వెళ్లి అరెస్టు చేసినా ఆశ్చర్యం ఉండదు. విచారణకు సహకరించని వారికి కోర్టులు కూడా ఊరట ఇవ్వవు. విచారణకు రాలేకపోతే ఆ విషయం ఎస్హెచ్వోకి విజ్ఞప్తి చేసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇవాళ ఆయన హాజరు కాకుండా రాలేకపోతున్నానని సమాచారం పంపినా దాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.
రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టడానికి.. ముందు, తర్వాత ఏం జరిగిందన్నదానిపై పోలీసులకు ఇప్పటికీ పూర్తి సమాచారం అందింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ కు వచ్చిన డబ్బుల వరకూ అన్ని వివరాలతో ప్రశ్నించేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఈ విషయంపై స్పష్టత ఉండటంతోనే వైసీపీ పెద్దలు ఆయనకు విచారణకు హాజరు కావొద్దని సలహాలు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ నిండా మునిగిపోయిన ఆయన అరెస్టు భయంతో ఉన్నారు.
తాను అరెస్టు కావాల్సిన పరిస్థితి వస్తే అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పేసే అవకాశం ఉంది. ఆర్జీవీ సహజంగా ఇలాంటివి చేయరు. ఆయన డబ్బుల కోసం ఆశపడి చేశారు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు..ఎవరు కంటెంట్ పంపించారు.. అనే దానిపై ఆయన వాంగ్మూలం ఇస్తే మిగతాది పోలీసులు చూసుకుంటారు. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండదు. ఏం జరగాలన్నా ముందు ఆయన విచారణకు హాజరు కావాలి. తప్పించుకోవాలనకుంటే మాత్రం ముందుగా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.