వైసీపీ నేతలకు షర్మిల టెన్షన్ ప్రారంభమయింది. ఇప్పటి వరకూ షర్మిల వైసీపీ నేతలు చేస్తున్న విమర్సలపైనే కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఇంకా బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఇంకా మాట్లాడలేదు. ఆ అస్త్రం షర్మిల దగ్గర ఇంకా ఉంది. నిజానికి షర్మిల ఇప్పటి వరకూ.. కుటుంబ విషయాలను ప్రస్తావించడం లేదు. కానీ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నీ షర్మిల వ్యక్తిత్వాన్ని.. కించ పరిచేలా… కుటుంబ విషయాలను కించ పరిచేలా మాట్లాడుతూండటంతో కౌంటర్ ఇస్తున్నారు.
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. షర్మిల ఏదో ఓ రోజు తన అస్త్రం.. వివేకా హత్యను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆమె చేరిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అసలు ఫ్యామిలీ డ్రామా ప్రారంభమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావాల్సింది మధ్యలో ఆగిపోయాయి. నిజానికి వైఎస్ వివేకా హత్య కేసులో .. ఏం జరిగిందో మొత్తం వైఎస్ కుటుంబసభ్యులందరికీ తెలుసు.
ఒక్కొక్కరు నిజాలు బయట పెట్టడం ప్రారంభిస్తే.. అసలు నిజాలు వెల్లువలా తన్నుకుంటూ బయటకు వస్తాయి. వివేకా హత్య జరిగినప్పుడు అందరూ సమైక్యంగానే ఉన్నారు. వైఎస్ వివేకా కుమార్తె కూడా జగన్ కే మద్దతు పలికారు. కానీ ఐదేళ్లలో మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అసలు నిజాల్ని వారే బయట పెట్టుకునే సమయం వచ్చింది.