ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా జరిగింది. ఈ వేడుకల్లో టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారం అందుకున్నారు చిరు. నందమూరి బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డు సొంతం చేసుకున్నారు. నాని దసరా సినిమాకి గాను ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సమంత దక్కించుకుంది.
ఈ వేడుకలో టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, బాలీవుడ్ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు.
విజేతల జాబితా:
ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- చిరంజీవి
ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణ
ఉత్తమ నటుడు (తెలుగు)- నాని (దసరా)
ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంత
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్
ఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్
ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పీఎస్ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పీఎస్ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పీఎస్ 2)
ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పీఎస్ 2)
ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్ 2)
ఉత్తమ విలన్ (తమిళం) – ఎస్జే సూర్య (మార్క్ ఆంటోనీ)
ఉత్తమ విలన్ (తెలుగు) – షైన్ టామ్ (దసరా)
ఉత్తమ విలన్ (కన్నడ) – జగపతి బాబు
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – vజయరామ్ (పీఎస్ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఉత్తమ లిరిక్స్ – జైలర్ (హుకుం)
ఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్
ఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఉత్తమ నటుడు (కన్నడ) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)