దాదాపుగా దక్షిణాది చిత్రాలకు ఇలియానా గుడ్‌బై చెప్పేసినట్టే! ఎందుకంటే తెలుగు, తమిళంలో ఇలియానా సినిమాలేం చేయడం లేదు. హిందీలో ఒకే ఒక్క సినిమా విడుదల కావాల్సివుంది. ఆ తరవాత ఎలాగూ ఖాళీనే. తెలుగు, తమిళం నుంచి ఇప్పుడు కొత్త సినిమాలేం వచ్చే అవకాశాల్లేవు. కాబట్టి టాలీవుడ్‌తో తన పనైపోయిందనుకొంటుందేమో.. ఇక్కడి దర్శకులపై నిప్పులుగక్కింది ఇలియానా. ”టాలీవుడ్లో ప్రతిభావంతులకు అవకాశాలొస్తాయన్నది అబద్దం. అక్కడ హంగున్న భామలదే రాజ్యం. మాటలకు పడిపోయేవాళ్లు చాలామంది ఉన్నారక్కడ..” అంటూ టాలీవుడ్‌పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కింది.
ఇలియానాకు టాలీవుడ్లో చాలా అవకాశాలొచ్చాయి. దేవదాస్ తో హిట్టు కొట్టిందో లేదో…స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చారు. ఆ విషయాన్ని ఇల్లూబేబీ అంత తేలిగ్గా ఎలా మర్చిపోయిందో.? పైగా ”దక్షిణాదిన బొద్దు గుమ్మలదే రాజ్యం.. మనల్ని పట్టించుకోడు.. నాజూగ్గా ఉంటే నచ్చదు” అంటూ కౌంటర్లు వేస్తోంది. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే మరి. నిన్నా మొన్నటి వరకూ టాలీవుడ్లో మళ్లీ అవకాశాలొస్తాయోమో అని వీరలెవిల్లో ప్రయత్నాలు చేసింది. ఇక రావు అని తెలుసుకొన్నాక ఇలా రెచ్చిపోతోంది. ఇలియానాకు అంత ఉడుకుమోతుతనం ఎందుకో మరి.