‘షాక్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. అప్పటి నుంచీ రవితేజతో మంచి అనుబంధం ఉంది. `షాక్` ఫ్లాపయినా ఆ బాకీని ‘మిరపకాయ్’తో తీర్చేసుకొన్నాడు. హరీష్ శంకర్ రైటింగ్ స్టైల్కీ, రవితేజ బాడీ లాంగ్వేజ్కీ కరెక్ట్ సింక్ ఏర్పడింది. అందుకే ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన `రైడ్` చిత్రాన్ని తెలుగులో హరీష్ రీమేక్ చేద్దామనుకొంటున్నాడు. రవితేజ హీరో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో కథానాయికగా ఇలియానాని ఎంచుకొన్నారని టాక్. రవితేజ – ఇలియానాలకు ఇది 5వ సినిమా. వీరిద్దరూ ఇది వరకు ‘కిక్’, ‘ఖతర్నాక్’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాల్లో నటించారు.
హరీష్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పవన్ ఇటు సినిమాలూ, అటు రాజకీయం అంటూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఏపీలో ఎలక్షన్ ఫీవర్ మొదలైతే, పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టక తప్పదు. ఆ గ్యాప్లో రవితేజతో ఈ సినిమా మొదలెట్టే ఆలోచన వుంది.