టాక్ షోలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనా… కథానాయికలతో షోలు చేయడానికి ఛానళ్లు, ఓటీటీ సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆహా కోసం… సమంత ఓ షో చేసింది. తమన్నాతో ఆహా ఓ షో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఇలియానా సైతం ఈ రంగంలోకి దిగిపోయింది. అమెజాన్ కోసం ఇలియానా ఓ టాక్ షో చేయబోతోందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగిపోయాయట. ఇందు నిమిత్తం ఇలియానా భారీ పారితోషికం అందుకోబోతోందని సమాచారం. తొలి సీజన్ లో వచ్చే స్పందన చూసి – తరువాతి సీజన్‌కి ఇలియానాని కొనసాగించాలా.? లేదంటే మరో కథానాయికని తీసుకోవాలా? అనే విషయంలో అమెజాన్ నిర్ణయం తీసుకోనుంది. ఇలియానాకు సౌత్ లో మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇలియానాకు పాన్ ఇండియా గుర్తింపు ఉండడంతో.. పారితోషికం ఎక్కువైనా సరే, ఆమెనే ఎంచుకొందట అమెజాన్. ఈ టాక్ షోకి ఓ ప్రముఖ దర్శకుడి ఆధ్వర్యంలో నడుస్తుందని సమాచారం. ఆ దర్శకుడు కూడా సౌత్ ఇండియాకి సంబంధించినవాడే అని తెలుస్తోంది.