ఇళయరాజా అంటే తెలియని మ్యూజిక్ లవర్ ఇండియాలోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇళయరాజా కొన్ని భాషల్లో సినిమాలు చెయ్యనప్పటికీ ఆయా భాషల్లో ఇళయరాజా సంగీతంలో వచ్చిన సినిమా డబ్ అవ్వడం ద్వారా ఆయన సంగీతాన్ని అక్కడి ప్రేక్షకులు కూడా ఆస్వాదించారు. ఇళయరాజా రాక ముందు ఒక మూసధోరణిలో వెళ్తున్న సంగీతాన్ని స్వస్తి పలికి సౌత్ ఇండియన్ సినిమాకి కొత్త తరహా సంగీతాన్ని పరిచయం చేసింది మాత్రం ఇళయరాజా అనే చెప్పాలి. అంతకుముందు ఎం.ఎస్.విశ్వనాథన్ వంటి వారు కొత్తదనం చూపించే ప్రయత్నం చేసినా ఇళయారాజా మాత్రం అన్నిరకాల పాటలను తనదైన స్టైల్లో చెయ్యడం ద్వారా తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా, మ్యూజిక్ మేస్ట్రోగా పేరు తెచ్చుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘తారై తప్పట్టై’ చిత్రంతో ఇళయరాజా 1000 సినిమాలు పూర్తి చేసుకున్నారు.
ప్రస్తుతం 1001 సినిమాకి సంబంధించిన ట్యూన్స్ కట్టే పనిలో బిజీగా వున్నారు ఇళయరాజా. ఇప్పటివరకు ప్రేక్షకులకు పరిచయం వున్న ఇళయరాజా సంగీతానికి భిన్నమైన సంగీతాన్ని తన 1001 సినిమాకి అందించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చాలా పాటలు పాడిన ఇళయారాజా ఈ సినిమాలో ఓ పెప్పీ ట్యూన్‌తో వచ్చే పాటను పాడబోతున్నారు. ఇప్పటివరకు ఇళయరాజా పాడిన పాటలకు పూర్తి డిఫరెంట్‌గా వుండే ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటి నుంచే మ్యూజిక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ జనరేషన్లోని యూత్‌ని తన పాటతో ఇళయారాజా ఎంతవరకు ఆకట్టుకుంటారో వెయిట్ అండ్ సీ