అధికారంలోకి వస్తే ఎవరైనా అప్పటి వరకూ ఎన్ని వెధవ వేషాలు వేసి రాజకీయాలు చేసినా తర్వాత గౌరవంగా..పెద్ద మనిషి తరహాలో ఉండాలనుకుంటారు. కానీ ఏపీ సీఎం జగన్ రెడ్డి స్టైలే వేరు. అధికారం ఉంది కాబట్టి ఇక తాను చేసే పనులకు అడ్డం.. దిడ్డం ఉండదు .. ఇక రెచ్చిపోవడమే అనుకున్నారు. అదే తన పార్టీ నేతలకు చెప్పారు. ఆయన చేసిన దోపిడీలు.. ప్రజల రక్తం పీల్చడం …. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు గురించి చెప్పుకోవాలంటే ఓ చరిత్ర అవుతుంది. అయితే ఆయన సమాజాన్ని.. కలుషితం చేసేలా బూతుల సామ్రాజ్యాన్ని కూడా స్థాపించే ప్రయత్నం చేశారు.
వైసీపీ అధికార భాష అమ్మ నా బూతులు తిట్టడం
జగన్ రెడ్డికి ఎవరైనా ఓ పేదని ఆదుకుంటే హ్యాపీగా ఉండదు. ఓ పరిశ్రమను సాధిస్తే హ్యాపీగా ఉండదు.. ఆయనకు ఆనందం కలిగించేది ఒక్కటే. తన రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులతో తిట్టించి అవి వినీ ఆనంపడటం. ఇది ఏ రకమైన మానసిక వ్యాధో కానీ ఆయన మనసును రంజింప చేసి… తమకు కావాల్సిన పనులు చేయిచుకునేందుకు నేతలు పోటీ పడ్డారు. ఏ స్తాయిలో అంటే… మద్యం దకాణాల దగ్గర తాగుబోతులు మాట్లాడుకునే భాష కన్నా దారుణమైన భాషను రాజకీయాల్లోకి వైసీపీ నేతలు తెచ్చారు. తల్లి, చెల్లి, అక్క అనే గౌరవమర్యాదలు కూడా ఎవరికీ ఇవ్వలేదు.
టిక్కెట్లు పొందడానికీ అదే అర్హత
వైసీపీలో టిక్కెట్లు పొందడానికి అర్హత ఏమిటి ?. బాగా పని చేయడం .. జగన్ రెడ్డి చెప్పినట్లుగా గడప గడపకూ తిరగడం లాంటివి కాదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లతో పాటు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరున్నారో వారిని బండ బూతులు తిట్టడం. తిట్టడంలో ఎంత క్రియేటివిటీ చూపిస్తారో అంత ప్లస్ అవుతుంది. అలా బూతులుతిట్టడం తమ వల్ల కాదని అనుకున్న వారికి టిక్కెట్లు ఎగ్గొడుతున్నారు. గత ఎన్నికలలో బతిమాలి తెచ్చుకున్న నేతల్ని కూడా ఈ సారి బూతులు తిట్టలేదని.. టిక్కెట్ ఇవ్వలేదు. బూతులు తిడితేనే… జగన్ రెడ్డికి సన్నిహితుడు. లేకపోతే విధేయత అంతా మట్టిపాలే. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను తిట్టలేదని చెప్పి మంత్రి పదవి ఇవ్వలేదు. జోగి రమేష్ కి ఎందుకు పదవి వచ్చిందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
రివర్స్ లో కుటుంబాన్ని తిట్టినా లైట్ తీసుకునే నేచర్
నోరు వైసీపీ నేతలకేనా… అందరికీ ఉంటుంది. తిట్లే కాబట్టి… వారు ఎంత అసువుగా తిడతారో ఇతర పార్టీల నేతలుకూడా అంతే అసువుగా తిడతారు. తిట్టారు కూడా. జగన్ రెడ్డి భార్యా, పిల్లలను ఎంత మంది సోషల్ మీడయాలో అసభ్యంగా తిట్లందుకుంటున్నారో లెక్కే లేదు. పోలీసులు కేసులు పెడుతున్నారు. కానీ కేసులు పెట్టినా… చేసినా ప్రచారం మాత్రం ఆగకుండా ఉంటుందా ?. మనం ఏది చేస్తే ఎదుటి వాళ్లు మనపై అదే బుర ద చల్లుతారని అనుకున్నా… సరే.. తానన్నీ తుడిచేసుకుంటాను కాబట్టి ఎదుటి వాళ్లపై బూతులు ప్రయోగించాల్సిందేనని జగన్ రెడ్డి పట్టుదల . మొత్తంగా ఏపీ లో బూతు సామ్రాజన్య స్థాపన చేశారు. ఆంధ్రుల పరువు తీశారు.