లిక్కర్ పార్టీతో వార్తల్లోకి వచ్చిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల గెస్ట్ హౌస్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అది అక్రమ కట్టడం అని స్పష్టం చేశారు. రాజ్ పాకాల గెస్ట్ హౌస్ అక్రమ కట్టడమా.. అనుమతులు ఉన్న కట్టడమా చెప్పాలని వచ్చిన ఆర్టీఐ ధరఖాస్తుకు పంచాయతీ అధికారులు సమాధానం పంపించారు. అందులో అది అక్రమ కట్టడమని తేల్చి నోటీసులు జారీ చేయడం జరిగిందని దాని కోర్టులో కానీ మరెక్కడా కానీ పిటిషన్లు దాఖలు కాలేదని స్పష్టం చేశారు.
జన్వాడలో ఉంది ఫామ్ హౌస్ కాదని.. ఇల్లేనని బీఆర్ఎస్ నేతలు లిక్కర్ పార్టీ జరిగిన రోజున ప్రకటించారు. గృహ ప్రవేశం జరిగినప్పుడు అందరికీ పార్టీ ఇవ్వలేదని..అందుకే దీపావళి పార్టీ అక్కడ ఇచ్చారని కుటుంబసభ్యులంతా హాజరయ్యారని ..అది ఫ్యామిలీ పార్టీ అని అంటున్నారు. అయితే పార్టీకి హాజరైన ఒకరికి కొకైన్ పాజిటివ్ రావడంతోనే సమస్య వచ్చింది. ఆయనకు రాజ్ పాకాలనే డ్రగ్స్ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.
ఈ వ్యవహారం చట్ట పరంగా అరెస్టులు చేసేంత కాకపోవడంతో.. ఎవర్నీ అరెస్టులు చేయలేదు. విజయ్ మద్దూరి దేశం విడిచిపారిపోకుండా.. లుకౌట్ నోటీసులు మాత్రం జారీ చేశారు. ఇప్పుడీ ఫామ్ హౌస్ అక్రమం అని తేలడంతో అధికారులు ఏం చేస్తారన్న ఆసక్తి ఏర్పడింది. కూలుస్తారా లేకపోతే.. వేచి చూస్తారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.