ప్రజా వేదిక అక్రమ కట్టడం దాన్ని తక్షణమే కూల్చి వేయండి అంటూ సీఎం ఆదేశాలు ఇవ్వడంతో విజయవాడలో ప్రజా వేదిక లాంటి భవనాలు ఎన్ని ఉన్నాయి అనేదానిపై అధికారులు దృష్టి సారించారు. ప్రజావేదిక లాంటి భవనాలు విజయవాడ నగర వ్యాప్తంగా వందకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తగిన అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా నిర్మితమైందంటూ ప్రజా వేదిక కూల్చివేసింది. ఒక ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే అక్రమం అని నిర్ధారించి కూల్చివేయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. విచిత్రం ఏమిటంటే విజయవాడలో ప్రధానమైన రైవస్ కాలువ, బందర్ కాలువ గట్ల వెంబడి దశాబ్దాల నుంచి వందలాది కట్టడాలు అక్రమంగా వెలిశాయి. అందులో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక కార్యాలయాలు కూడా ఉన్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ బంగ్లా తో పాటు సీఆర్డీఏ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణమే.
విజయవాడ మున్సిపల్ గెస్ట్ హౌస్ దశాబ్దాల కిందటే కాలువ ఒడ్డున నిర్మితమైంది దీని ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న అనాధలకు ఆశ్రయం ఇస్తున్న నిర్మల్ భవన్ , స్వరాజ్ మైదానం పరిసరాల్లో నిర్మించిన ఆఫీసర్స్ క్లబ్ విద్యుత్ శాఖకు చెందిన నిర్మాణాలు, పోలీస్ క్వార్టర్స్, గాంధీనగర్ లో రైవస్ కాలువ ఆనుకొని నిర్మాణం చేసుకున్న పోలీస్ క్లబ్ , రోటరీ క్లబ్, అగ్నిమాపక శాఖ కార్యాలయం, సీఆర్డీఏ కార్యాలయం పాటు అనేక ప్రభుత్వ ,ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన కార్యాలయాలు అక్రమంగా నిర్మించారు. ప్రజా వేదిక వర్తించే ప్రమాణాలు ఈ భవనాలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కాల గట్ల వెంబడి ఉన్న ప్రభుత్వ భవనాలు కూడా కూల్చి వేస్తారా అన్న చర్చ అధికారవర్గాల్లో మొదలైంది.
నదీ తీర ప్రాంతం అయితే 50 మీటర్ల లోపు కాలవ గట్టు అయితే కనీసం 30 అడుగులు లోపు ఎటువంటి నిర్మాణాలు నిర్మించకూడదు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. 2017 – 18 మున్సిపల్ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని స్పష్టం చేశారు.
కానీ విజయవాడ నగరంలో ఉన్న ప్రధానమైన రైవస్ కాలువ, బందర్ కాలువ గట్ల ఇంత ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నీ 30 అడుగులలోపే ఉన్నాయి. ఇప్పుడు వీటి కూల్చివేత చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.