తెలంగాణలో చెరువుల ఆక్రమణలు ఎలాగో ఏపీలో కాల్వగట్లు, ఏరులను ఎలా ఆక్రమించేశారు. ఆ ఫలితం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. కొండల మీద కూడా ఆక్రమించి ఇళ్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వాటన్నింటినీ సంస్కరించాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వంపై పడింది.
హైడ్రా తరహాలో ఇక విశ్వరూపం చూపించి కూల్చివేతలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. బుడమేరు ముంపుతో మేలుకోవాల్సి వచ్చింది. బుడమేరు ఇప్పటికే సగం ఆక్రమణకు గురైంది. ఎలాంటి వారు ఉన్నా… క్లియర్ చేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. అయితే ముప్పు వచ్చింది కదా అని.. బుడమేరు ఒక్కటే అని కాకుండా ఆక్రమణకు గురైన ప్రతి ఒక్క కాల్వని… ఏరుని ఆక్రమణల బారి నుంచి బయటపడేయాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్లోలా ఏపీలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన కబ్జాలు జరగలేదు. ఏపీలో గత ఐదేళ్లలో జరిగినవే ఎక్కువ. అందుకే ఇలాంటి వాటిని తొలగించడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో వానలు పూర్తయిన తర్వాత… పూర్తి యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యే అవకాశం ఉంది.