భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దాంతో వెంటనే ఆమెను ఫారిస్ లోని ఆసుపత్రికి తరలించారు భారత అధికారులు.
ఫైనల్ కు ముందు నిర్ణీత బరువు కంటే ఎక్కువగా ఉండటంతో ఆమెపై ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడింది. అయితే, హెవీ వెయిట్ కారణంగా బరువు తగ్గేందుకు గాను రాత్రంతా స్కిప్పింగ్ , సైక్లింగ్, జాగింగ్ చేయడంతో ఒక్కరోజులోనే కిలోమేర బరువు తగ్గింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
మరోవైపు…ఆమెపై అనర్హత వేటు పడటంతో తదుపరి ఏం చేయవచ్చు అనే దానిపై ప్రధాని మోడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. వినేష్ పోగట్ పై అనర్హత వేటును నిరసిస్తూ నిరసన తెలపాలని పిటి ఉషకు ప్రధాని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక, ఆమె ఆరోగ్య పరిస్థితిని మోడీ అడిగి తెలుసుకొని.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.