రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతం `పెళ్లి సందడి`. ఆ పాటలూ, ఆ గ్లామరూ.. ఆ హంగామా ఎవర్ గ్రీన్. ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన్నుంచి మరో సినిమా వస్తోంది. కాకపోతే.. రాఘవేంద్రరావు ఈసారి దర్శకత్వ పర్యవేక్షణకు పరిమితం అవుతున్నారు. పెళ్లి సందడి అని కాకుండా `పెళ్లి సందD` అంటూ టైటిల్ పెట్టారు. టైటిల్ లో డి అనే ఆంగ్ల అక్షరం సరదాగానో, ట్రెండీగానో పెట్టింది కాదట. ఆ `డి`కి… సినిమాలో చాలా ప్రాధాన్యత ఉందని టాక్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఓ కథానాయికగా కొత్తమ్మాయిని ఎంచుకుంటారు. మరో పాత్రలో స్టార్ హీరోయిన్ కనిపిస్తుందని టాక్. ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాలి. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల కంపోజింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. `పెళ్లి సందడి`లో పాటలన్నీ సూపర్ హిట్టే. ఇప్పటికీ ఆ పాటల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి ఈ `పెళ్లి సందD` లో పాటలెలా ఉంటాయో..?