ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కల్లాం అజేయరెడ్డికి అనుబంధంగా గతంలో కేటాయించిన శాఖలన్నింటినీ.. గత వారం జగన్మోహన్ రెడ్డి తొలగించారు. శాఖ లేని సలహాదారుగా ఉంచారు. అయితే.. అనూహ్యంగా.. ఆ నిర్ణయం జరిగిన తర్వాత రోజే.. ఆయన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లిన బృందంలో ఉన్నారు. నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర కేంద్రమంత్రులను కలిశారు. వినతి పత్రాలు ఇచ్చి… ఏపీకి రావాల్సిన నిధుల విషయం చర్చించిన వారిలో.. కల్లాం కూడా కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి.., అంతకు ముందు.. ఓ రాజకీయ ర్యాలీలో నిర్మలా సీతారామన్ చేసిన …కరెంట్ ఆరోపణలకు… వైసీపీ తరపున ఎవరూ మాట్లాడలేదు. కానీ కల్లాం మాట్లాడారు. నిర్మలా సీతారామన్‌పై విమర్శలు చేశారు.
అయినప్పటికీ.. ఆయనను కూడా ఢిల్లీకి వెళ్లే బృందంలో వైసీపీ పెద్దలు ఉంచారు. ఆ తర్వాత కూడా… కల్లాం అజేయరెడ్డికి ప్రభుత్వంలో ప్రాథాన్యత తగ్గలేదు. ఆయన నుంచి శాఖలు తొలగించినా.. ఫైళ్లు ఇప్పటికీ ఆయన వద్దకే వెళ్తున్నాయన్న ప్రచారం సచివాయవర్గాల్లో ఉంది. మామూలుగా.., ఆయన సలహాదారు మాత్రమే.. ఎలాంటి సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ.. సలహాదారుగా… ఆయన చెప్పినట్లుగానే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఆయన వద్దకు కీలక ఫైళ్లను పంపుతారు. శాఖలు తీసేసిన తర్వాత ఇక పంపాల్సిన అవసరం లేదని సెక్రటేరియట్ కీలక శాఖల్లో ప్రచారం జరిగింది. చివరికి అదంతా.. పొలిటికల్ గేమ్ అని… కల్లాం అజయ్ రెడ్డికి.. నేడో.. రేపో… కొత్తగా శాఖలు కేటాయిస్తూ.. ప్రకటన వస్తుదని చెబుతున్నారు. అందుకే… ఆయనకు ఫైళ్లు పంపవద్దని ఎవరూఆదేశించలేదని చెబుతున్నారు.
అజేయరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారో.. ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆయనతో పాటు.. పీవీ రమేష్ శాఖల్ని కూడా తొలగించారు. దాంతో వారిద్దరూ అసంతృప్తితో ఉన్నారని… వైదొలుగుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ లోపే.. అజేయరెడ్డికి ప్రాధాన్యం తగ్గలేదని ప్రభుత్వమే సంకేతాలు పంపుతోంది. కానీ పీవీ రమేష్ కు మాత్రం.. ఎలాంటి వెసులుబాటు కనిపించలేదు. శాఖల కోత తర్వాత ఆయన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు.