తెలంగాణలో ఐ ప్యాక్ టీం టీఆర్ఎస్ కోసం పని చేస్తే పీకేని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని ఆ పార్టీ తెలంగాణ నేతలు కాంగ్రెస్ హైకమాండ్‌కు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ ఈ మేరకు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. శత్రువుతో స్నేహం చేసేవారిని ఎప్పటికీ నమ్మవద్దని మహాత్మాగాంధీ కోట్‌ను ట్వీట్ చేశారు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయానికి ప్రయత్నించే వ్యూహాలు అందించడం అనే ఊహే ఎవరికీ తట్టడం లేదు. కానీ తాను అలాగే చేస్తానని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.
దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఐ ప్యాక్ మరెవరికీ పని చేయకూడదన్న షరతును కాంగ్రెస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పీకే ఏం నిర్ణయం తీసుకుంటారో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం… భిన్న వాదనలు ప్రారంభమయ్యారు. మాణిగం ఠాగూర్ ఢిల్లీ స్థాయిలో హైకమాండ్ పై ఒత్తిడి తెస్తూంటే… హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. పీకే టీం టీఆర్ఎస్ కోసం పని చేయదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకు వచ్చి కలిశారని ఆయన అంటున్నారు.
పీకే కాంగ్రెస్‌లో చేరిన తరవాత ఉమ్మడి సమావేశం పెడతామని.. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని సర్వే లెక్కలు కూడా బయటపెడతామని ఆయన అంటున్నారు. తన సందేశాన్ని పార్టీ హైకమాడ్కు రేవంత్ ఇప్పటికే పంపారు. టీఆర్ఎస్ కోసం ఐ ప్యాక్ పని చేస్తుందన్న విషయాన్ని ఇప్పటి వరకూ పీకే బయట పెట్టలేదు. టీఆర్ఎస్ అనుకూల మీడియానే చెబుతోంది. పీకే .. ఐ ప్యాక్ అధికారిక ప్రకటన చేస్తే తప్ప క్లారిటీ రాదు.