దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి హైదరాబాద్‌కు వస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్.. రూ.20,761 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో మల్టిపుల్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించారు హైదరాబాద్‌లో 2022 నాటికి అమెజాన్ వెబ్ సిర్వీసెస్ సెంటర్ పూర్తవుతుది. తెలంగాణలో అతి పెద్ద పెట్టుబడి విషయాన్ని శుక్రవారం ప్రకటిస్తానని కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. శుక్రవారం.. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి విషయాన్ని ప్రకటించారు.
మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేసి.. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు చేయనుంది ఏడబ్ల్ఎస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ అంటున్నారు. గతంలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లినప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులు కేటీఆర్‌తో చర్చలు జరిపారు.
ఇప్పుడు ఆ పెట్టుబడి ఆచణలోకి వచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమన్యస్థానంగా మారుతుందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో అతిపెద్ద కార్యాలయాన్ని అమెజాన్ నిర్మించింది.