రవితేజ మాంచి జోరులో వున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా సినిమాలు సెట్స్ పై వున్నాయి. ఇందులో ధమాకా విడుదలకు రెడీ అవుతుంది. ఇవి కాకుండా సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనిని దర్శకుని పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడీ సినిమాకి ఇంకా హీరోయిన్ దొరకలేదు.
అనుపమ, కృతిశెట్టి, ప్రియా వారియర్, రీతూ వర్మ.. మరో ఇద్దరు హీరోయిన్లుని సంప్రదించారు. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. పాత్ర నచ్చక కొంతమంది, డేట్లు సర్ధలేక మరికొంతమంది సినిమాని అంగీకరించలేదు. సినిమా ప్రీప్రొడక్షన్ పనులు దాదాపు పుర్తయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ స్టయిలిష్‌గా డిజైన్ చేశాడు కార్తిక్. అన్నీ ఓకే కానీ హీరోయిన్ కోసమే వెయిటింగ్.