ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. అసలు ఈవీఎంలు పని చేయడం ప్రారంభమయింది ఉ. పది గంటల తర్వాతే. అంటే.. పోలింగ్ సమయం తగ్గిపోయింది. ఎండలు మండిపోయాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవు. గతంతో పోలిస్తే.. ఎన్నికల నిర్వహణ తీసికట్టుగా ఉంది. అయినప్పటికీ… ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతం కన్నా.. రెండు, మూడు శాతం ఓట్లు అధికంగా నమోదయ్యాయి. దీనిపై.. అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎవరి అనుకూలం అన్నది రెండు పార్టీల్లోనూ… విస్తృతమైన చర్చలకు కారణం అవుతోంది. ఏ పార్టీకి.. ఆ పార్టీ తమకు అనుకూలంగా విశ్లేషణలు చేసుకుంటున్నాయి.
సహజంగానే.. మహిళలు, వృద్ధులు… తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారనే అంచనాలున్నాయి. సామాజిక పెన్షన్లు తీసుకునేవారు…. ప్రభుత్వంపై ఓ రకమైన కృతజ్ఞతాభావంతో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు సీఎం కాక ముందు రూ. 200 మాత్రమే ఉన్న పెన్షన్ .. ఆయన సీఎం అవగానే రూ. 1000 చేశారు. ఇప్పుడది రెండు వేలు అయింది. ఇక మహిళలకు ఆయన పసుపు-కుంకుల పేరుతో.. మూడు నెలల పాటు వరుసగా… చెక్కులు అందించారు. అవి క్యాష్ అయ్యాయి. వీటిని పొందిన వారిలో…. వైసీపీ ఓటు బ్యాంక్‌కు చెందిన వారు కూడా.. కొంత మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారన్న అంచనాలు…. రాజకీయ విశ్లేషణల్లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్లో…. కూడా.. కొంత మంది వైసీపీ ఓటు బ్యాంకుకు చెందిన వారైనప్పటికీ.. ఈ సారికి టీడీపీకి వేద్దా.. అన్న ఆలోచన చేసినట్లుగా విశ్లేషిస్తున్నాయి. టీడీపీ వర్గాలు కూడా ఇదే అంచనాతో తమకు 130 సీట్లు అని ప్రచారం చేసుకుంటున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు… అంతా ప్రభుత్వ వ్యతిరేకతేనని చెబుతున్నాయి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదని… ఎవరికీ న్యాయం చేయలేదని.. అందుకే.. ఓటుతో… ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని విశ్లేషించుకుంటున్నాయి. తమకు 100 నుంచి 110 స్థానాల్లో విజయం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మహిళలు, వృద్ధులు కూడా.. జగన్ చెప్పిన నవరత్నాల పట్ల ఆకర్షితులయ్యారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి… పోలింగ్ సరళిని బట్టి…. పరిస్థితేమిటో.. చాలా మంది ఓ అంచనాకు వచ్చారు. మెజార్టీ వర్గాలు ఏమంటారో.. అదే ఫలితం అయ్యే అవకాశం ఉంది.