టిక్కెట్ రేట్ల పెంపును సహించే ప్రశ్నే లేదంటూ.. మంత్రి తలసాని చేసిన ప్రకటనలు తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోయాయి. పెరిగిన రేట్లతోనే… సినిమా విడుదలయింది. అదే రేట్లతో టిక్కెట్ల బుకింగ్ కూడా జరిగిపోయింది. చివరికి తలసాని.. ప్రభుత్వానికి ఇష్టం లేకుండానే రేట్లు పెంపు జరిగిందనే… ఫీలింగ్ రావడానికి మాత్రమే హడావుడి చేసినట్లు స్పష్టమయింది.
ప్రభుత్వానికి తెలియకుండా రేట్లు పెంచేస్తారా..?
సినిమా ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు… రేట్లు పెంచుతున్నారనే సమాచారం ప్రభుత్వానికి లేకుండా ఉండదు. అయినప్పటికీ.. పట్టించుకోలేదు. ధియేటర్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే.. రేట్లు పెంచేసి బుకింగ్ చేసేసుకున్నాయి. ఇది బయటకు వచ్చి వివాదం అయ్యే సరికి.. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని.. హడావుడి పడ్డారు. మొదట.. ఉత్తదే అని ప్రకటన చేశారు. అలా చేయాలనుకున్నప్పుడు.. ముందుగా ఎందుకు రేట్లు పెంచారో… తెలుసుకోకుండా ఉండరా..?. తెలిసి కూడా అలాంటి ప్రకటన చేశారా..?. మళ్లీ విమర్శలు వస్తాయన్న భయంతో.. ధరల పెంపు తీర్పు పై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ధరలు పెంచే ముందు యాజమాన్యాలు తమ అనుమతి తీసుకోలేదని తలసాని తన తప్పేం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.
సినిమా రిలీజయ్యే వరకూ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..!
సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్న రేట్లను 80 నుంచి 110 రూపాయలకు పెంచారు మల్టీప్లెక్స్ థియేటర్ లలో 138 నుంచి 200 వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ యజమానులు ప్రకటించారు… ఈ అంశం ఇప్పుడు వివాదంగా మారింది 2017 లో వచ్చిన కోర్టు డైరెక్షన్ ప్రకారం సినిమా థియేటర్ల యజమాన్యాలు టిక్కెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వారికి కొత్త ధరలు అందుబాటులో ఉంచాయి. కోర్టు ఉత్తర్వుల పేరుతో.. ఇష్టారాజ్యంగా ధియేటర్ల రెంట్లు పెంచడంతో… ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది.
ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకునే తాపత్రయమే..!
సినిమా టికెట్ల ధరల పెంపు అన్నది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. సామాన్యులు సైతం సినిమా చూసే విధంగా గా ప్రభుత్వం ఎక్కడ కూడా రేట్లు పెంచమని చెప్పలేదని ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి లేదన్నారు ఆయన సినిమా థియేటర్లు థియేటర్ల యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు .. కానీ.. కోర్టులో పిటిషన్ వేసే ప్రయత్నం చేయలేదు. కోర్టుకెళ్తామన్నారు కానీ.. ఇంత వరకూ ఆ చర్యల్లేవు. సినిమా రిలీజ్ అయిపోయింది. పెరిగిన ధరలతోనే టిక్కెట్లు అమ్మేసారు. ఇక ఇప్పుడు కోర్టుకెళ్లి… ప్రభుత్వం ఏం సాధిస్తుంది. కర్ర విరగకుండా.. పాము చావకుండా… తలసాని ఆడిన గేమ్ ప్లాన్ అని సినీ ప్రేక్షకులు ఊసూరుమనాల్సిన పరిస్థితి ప్రేక్షకులది..!