బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టును టీమ్ఇండియా కైవసం చేసుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌పై టీమ్ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్ బుమ్రా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
భారత్ ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే కాకుండా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలోనూ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ ముందు వరకూ తొలి ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా కిందికి పడిపోయింది. వచ్చే ఏడాది జూన్‌లో జరగబోయే WTC ఫైనల్లో భారత్ తలపడాలంటే ఈ సిరీస్‌ను కనీసం 4-0 తేడాతో దక్కించుకోవాల్సి ఉంది.