మొతేరాలో బౌలర్ల హవా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లోనూ చేతులెత్తేసింది. కేవలం… 81 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో.. భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం ఉంచగలిగింది. రెండోరోజు 3 వికెట్ల నష్టానికి 99 పరుగులతో భారత ఇన్నింగ్స్ ప్రారంభమై… 145 పరుగుల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో.. భారత్ కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అతనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 81 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్‌కి 5 వికెట్లు దక్కాయి. అశ్విన్ ఖాతాలో 4 వికెట్లు చేరాయి. ఈ క్రమంలో టెస్టులో 400 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు అశ్విన్. కేవలం 77 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించాడు. చివరి వికెట్ వాషింగ్టన్ సుందర్ చేజిక్కించుకున్నాడు. మొతేరాలో ఇది రెండో రోజు మాత్రమే. మరో… 40 ఓవర్ల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లో ముగియడం లాంఛనమే.