ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈరోజు న్యూజీలాండ్ ని చిత్తు చేసిన భారత్ వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఇది వరకే భారత జట్టు సెమీస్ బెర్త్‌ని ఖాయం చేసుకొన్న సంగతి తెలిసిందే. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో చిలిచిన భారత్, గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీస్ లో తలపడబోతోంది. మంగళవారం తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. బుధవారం రెండో సెమీస్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడబోతున్నాయి.
ఈ రోజు జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత న్యూజీలాండ్ బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఆ తరవాత అక్షర్ పటేల్ (42), శ్రేయాస్ అయ్యర్ (79) బాధ్యతాయుతంగా ఆడి భారత ఇన్నింగ్స్ ని గాడిలో పెట్టారు. చివర్లో హార్దిక్ పాండ్యా (45) కూడా బ్యాటుతో రాణించి విలువైన పరుగులు జోడించాడు. మొత్తానికి న్యూజీలాండ్ ముందు 250 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై భారత బౌలర్లు కలసి కట్టుగా రాణించారు. ముఖ్యంగటe వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో విజృంభించాడు. కులదీప్‌కు 2 వికెట్లు దక్కాయి. అక్షర్, జడేజా, హార్దిక్ చెరో వికెట్ దక్కించుకొన్నారు. దాంతో 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాటర్లలో విలియమ్స్ (81) పరుగులతో రాణించాడు.