మెడికల్ మాఫియానా లేకపోతే ప్రజల భయాలతో ఆడుకుంటారో కాన చలికాలం సీజనల్ గా అందరికీ వచ్చే జలుబును చూపించి కొత్త కొత్త వైరస్లతో బయపెట్టేందుకు రెడీ అయ్యారు. చైనాలో కొత్తగా హెచ్ఎంపీవీ అనే వైరస్ వ్యాప్తి చెందిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ చైనా మాత్రం.. అవన్నీ సీజనల్ వైరస్లేనని గత ఏడాది కన్నా తక్కువ మందికి సోకిందని చెబుతోంది. కానీ ఆ వైరస్ ను బూచిగా చూపించి ప్రజల్ని భయపెట్టేందుకు ఇండియాలో అంతా రెడీ అయిపోయింది.
భారత్ లో ఓ ఎనిమిది నెలల శిశువుగా హెచ్ఎంపీవీ సోకిందని జాతీయ మీడియాగా చెప్పుకునే చానళ్లు ప్రకటించాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేసిన చికిత్సతో ఇది బయటపడింది. అక్కడ చేసిన టెస్టుల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ అని నిర్దారించారు. దీంతో దేశంలో గగ్గోలు. పుట్టించడానికి అవసరమైన సరుకు దొరికినట్లయింది. కానీ ఈ వైరస్ అసలు ప్రమాదకరం కాదనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. ఈ వైరస్ వల్ల అసాధారణ లక్షణాలు కనిపించవు. సాధారణ జలుబు దగ్గూ మాత్రమే ఉంటాయి.
క్యూర్ చేయడానికి ప్రత్యేకమైన మంతులు కూడా లేవు. మలుపు, దగ్గుమందులే వాడతారు. కానీ ఈ వైరస్ పేరుతో చేసే హడావుడి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కరోనా తర్వాత ప్రజల ఆర్థిక ఆరోగ్యాన్ని మెడికల్ మాఫియా దోచుకుంది. ఇప్పుడు ఇలాంటి వైరస్ ల పేరుతో ప్రతి చలికాలంలో హంగామా చేసి.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ నిజాలు చెప్పాల్సిన మీడియా కూడా ఇందులో భాగమైపోతోంది. కరోనా కారణంగా చనిపోయినవారి కన్నా.. ఆ వైరస్ పై జరిగిన ప్రచారం వల్లనే ఎక్కువ మంది ఆందోళనతో చనిపోయారన్నది అసలు నిజం. కానీ ఎవరూ ఒప్పుకోరు.