పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలని కేంద్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాల రద్దుతో పాక్ కు కోలుకోలేని షాక్ ఇవ్వగా.. తాజాగా పాక్ పై ఎలాంటి దాడులకైనా సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
భారత్ – పాక్ సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శ్రీనగర్ కు ఆర్మీ చీఫ్ ద్వివేదీ చేరుకోవడం, కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్స్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రత స్థితిగతులపై ఆయన త్రివిధ దళాలతో సమీక్ష నిర్వహించారు.
మరోవైపు రఫెల్ , సుఖోయ్ ఫైటర్ జెట్స్ తో వాయుసేన డ్రిల్స్ నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్న మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో త్రివిధ దళాలతో ఆర్మీ చీఫ్ భేటీ కావడంతో ఏ క్షణంలోనైనా పాక్ పై సర్జికల్ స్ట్రైక్ ౩.౦ జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి.