రోమ్కెళ్లినప్పుడు రోమన్‌లా ఉండాలి. దీన్ని టీమిండియా పర్ఫెక్ట్గా క్యాచ్ చేసింది. భారీ లక్ష్యాన్ని చేధించాల్సినప్పుడు.. చూపించాల్సిన దూకుడును చూపించి.. తొలి టీ ట్వంటీని గెలిచేసిన.. టీమిండియా.. రెండో వన్డేలో… సింపుల్ లక్ష్యం సాధించడానికి దానికి భిన్నమైన స్లో అండ్ స్టడీ మార్గాన్ని ఎంచుకుని… సూపర్ విక్టరీ కొట్టింది. ఆక్లాండ్‌లో జరిగిన రెండో టీ ట్వంటీలో.. మళ్లీ కివీసే మొదట బ్యాటింగ్ చేసింది. కానీ.. తొలి మ్యాచ్‌లో చూపించినంత దూకుడు చూపించలేకపోయారు. భారత బౌలర్లు… గొప్ప ప్రతిభ ప్రదర్శించకపోయినా.. తమ సహజసిద్ధమైన టాలెంట్నుచూపించడంతో.. పరుగులు భారగా తీయలేకపోయారు. 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ చేయలేదు. తొలి ఓవర్లోనే రెండు సిక్సులు కొట్టి.. మ్యాచ్ ఏదో లా ఉండబోతోందని.. సంకేతాలు పంపినా.. కివీస్ ఆటగాళ్లి ఆరంభశూరత్వమే అయింది.
చేజింగ్‌లో టీమిండియా.. మొదట్లో కాస్త తడబడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు నిలబడలకేపోయారు. కానీ.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రం.. ఎలాంటి లూప్ హోల్‌కు చాన్స్ ఇవ్వలేదు. లక్ష్యం చిన్నదే కావడంతో.. కేఎల్ రాహుల్.. తన సహజస్వభావమైన దూకుడు ఆటకు.. నెమ్మదితనం నేర్పాడు. 50 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి… వ్యక్తిగత రికార్డుల కన్నా.. టీమ్ విజయమే ముఖ్యమని సందేశం పంపారు. శ్రేయస్ అయ్యర్… రాహుల్‌కు.. ఖచ్చితమైన జోడిగా నిలిచారు. 33 బంతుల్లో 44 పరుగులు చేసి.. గెలుపు ముంగిట ఔటయ్యారు. లాంచనాన్ని శివందూబేతో కలిసి రాహుల్ పూర్తి చేశాడు.
ఐదు టీ ట్వంటీల సీరిస్‌లో రెండు టీ ట్వంటీల్లోనూ టీమిండియాఘన విజయం సాధించింది. గతంలో న్యూజిలాండ్‌పై.. టీమిండియా టీ ట్వంటీ రికార్డు చాలా చెత్తగా ఉంది. కానీ.. ఈ సారి ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి త్వరగా అలవాటు పడిపోయారు. ఫలితంగా.. భారత్‌లో పిచ్‌లపై ఆడుతున్నట్లే ఆడుతున్నారు.