ఈనెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ జరుగబోయే భారత్-పాక్ టి-20 క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కోల్ కతా రావాలనుకొన్న ఏడుగురు పాక్ దౌత్యవేత్తలకు భారత్ వీసా నిరాకరించింది. వారందరూ పాకిస్తాన్ గూడచర్య సంస్థ ఐ.ఎస్.ఐ.కి చెందినవారయినందునే వారికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. అయితే ఆ విషయం పాకిస్తాన్ కి వ్రాసిన లేఖలో పేర్కొనలేదు. భద్రతా కారణాల వలన వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.
భారత్ నిర్ణయంపై పాక్ విదేశాంగ శాఖ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. “టి-20 వరల్డ్ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ లకు ఆతిద్యం ఇస్తున్న భారత్, అందులో పాల్గొంటున్న దేశాల ప్రతినిధులను స్వాగతించవలసింది పోయి, ఈవిధంగా అవరోధాలు సృష్టించడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఈవిధంగా జరగడం చాలా దురదృష్టకరం. పాక్ లోని భారత్ హైకమీషనర్ ద్వారా భారత్ కి మా నిరసన తెలియజేస్తాము,” అని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు పాక్ మీడియాకు చెప్పారు.