తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా వంద పరుగులు వెనుకబడ్డ భారత్… అద్భుతం చేసింది. డ్రా చేసుకోవడమే కష్టం అనుకున్న మ్యాచ్‌ని గెలుచుకుంది. మూడో టెస్ట్ లో భారీ తేడాతో ఓడిపోయిన భారత్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పై స్వీట్ రివైంజ్ తీర్చుకుంది. ఓవెల్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఐదవ రోజు భారత బౌలర్లు విజృంభించడంతో… 157 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 368 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన ఇండ్లండ్ నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 5వ రోజు కూడా పిచ్ బ్యాట్స్మెన్లకు అనుకూలిస్తుండడంతో… ఇంగ్లండ్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపించింది. అయితే… బుమ్రా, ఉమేష్ యాదవ్, శార్థూల్ టాకూర్లో కూడిన భారత ఫేస్ దళం.. ఇంగ్లండ్ ని మట్టికరిపించి 210 పరుగులకే ఆలౌట్ చేసింది. యార్కర్లతో ఇంగ్లండ్ ని బెంబేలిత్తించిన బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఉమేష్ కి 2, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో హమీద్ (63) ఒక్కడే రాణించాడు. ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. 5వ టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా ఈ సిరీస్ భారత్ దే.